Skip to main content

Posts

Showing posts from July, 2019

అవ్యక్తమైన సాన్నిహిత్యం

కొంతమంది విడిపోయారని మాట్లాడుకోరు, కొంతమంది మళ్లీ ఎక్కడ విడిపోతావేమో అనే భయంతో మాట్లాడుకోరు. ఆరోజు తను అర్థం చేసుకోలేదని తన వాదన, తను అర్థం అయ్యేలా చెప్పకుండానే దూరంగా పెట్టాడని తన వాదన. ఇరువురి వాదనలు ఒకరితో ఒకరికి కాదు, ఇద్దరిలో అవతలి వారికి తెలియకుండా పదిలంగా దాచుకున్న ఎదురెదురు మనసులది. ఆ దాపరికపు వాదన ఫలితమే ఈరోజు వారు అనుభవించే చెప్పుకోలేని ఈ ఒంటరి వేదన. నిజానికి వారిద్దని మద్య ఉన్నది దాటలేనంత గోడేం కాదు, దాటడం ఇష్టం లేనంత పంతం. ఇప్పుడంటే ఇష్టాన్ని Costly giftsతో కొలుస్తున్నారు కానీ, వాల్లింకా పాతకాలపు మనుషులే. ఒకరి మీద ఉన్న ఇష్టం ఇచ్చే గిఫ్ట్ price లో ఉండదు అనేంత maturity ఉన్నా కూడా ఇద్దరి మధ్య ఉన్న అంత దూరాన్ని తగ్గించుకోలేనంత మూర్ఖులు. ఒకరంటే ఒకరు అవసరం అయినప్పుడు అండగా ఉండటం, ఒకరి సాన్నిహిత్యం కోసం ఇంకొకరు పాకులాడటం, ఆ సాన్నిహిత్యం లోనే అందాన్ని ఆనందాన్ని వెతుక్కోవడం, జీవిత సత్యాలు మాట్లాడుకుని మురిసిపోవడం, వారి బాల్యపు చిలిపి చేష్టలు చెప్పుకుని నవ్వుకోవడం, అనుభవాలను పంచుకోవడం, అభిప్రాయాలను మార్చుకోవడం...ఇవే వాళ్ళకి తెలిసిన ఇష్టాన్ని చెప్పుకునే పద్ధతులు. ఇప్పటికీ ఇద్దరికీ స...