కొంతమంది విడిపోయారని మాట్లాడుకోరు,
కొంతమంది మళ్లీ ఎక్కడ విడిపోతావేమో అనే భయంతో మాట్లాడుకోరు.
ఆరోజు తను అర్థం చేసుకోలేదని తన వాదన,
తను అర్థం అయ్యేలా చెప్పకుండానే దూరంగా పెట్టాడని తన వాదన.
ఇరువురి వాదనలు ఒకరితో ఒకరికి కాదు, ఇద్దరిలో అవతలి వారికి తెలియకుండా పదిలంగా దాచుకున్న ఎదురెదురు మనసులది.
ఆ దాపరికపు వాదన ఫలితమే ఈరోజు వారు అనుభవించే చెప్పుకోలేని ఈ ఒంటరి వేదన.
నిజానికి వారిద్దని మద్య ఉన్నది దాటలేనంత గోడేం కాదు, దాటడం ఇష్టం లేనంత పంతం.
ఇప్పుడంటే ఇష్టాన్ని Costly giftsతో కొలుస్తున్నారు కానీ, వాల్లింకా పాతకాలపు మనుషులే. ఒకరి మీద ఉన్న ఇష్టం ఇచ్చే గిఫ్ట్ price లో ఉండదు అనేంత maturity ఉన్నా కూడా ఇద్దరి మధ్య ఉన్న అంత దూరాన్ని తగ్గించుకోలేనంత మూర్ఖులు. ఒకరంటే ఒకరు అవసరం అయినప్పుడు అండగా ఉండటం, ఒకరి సాన్నిహిత్యం కోసం ఇంకొకరు పాకులాడటం, ఆ సాన్నిహిత్యం లోనే అందాన్ని ఆనందాన్ని వెతుక్కోవడం, జీవిత సత్యాలు మాట్లాడుకుని మురిసిపోవడం, వారి బాల్యపు చిలిపి చేష్టలు చెప్పుకుని నవ్వుకోవడం, అనుభవాలను పంచుకోవడం, అభిప్రాయాలను మార్చుకోవడం...ఇవే వాళ్ళకి తెలిసిన ఇష్టాన్ని చెప్పుకునే పద్ధతులు.
ఇప్పటికీ ఇద్దరికీ సంబంచిన చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుపెట్టుకుంటారు కానీ వ్యక్తపరచరు. కారణం వారికే తెలియాలి,తప్పు వాళ్ళలోనే పెట్టుకుని కాలాన్ని నిలదీసే తెలివితక్కువ మేధావులు.
ఇంత తెలిసినా, ఇంత దూరంగా ఉన్నా ఒకరి ఊహల్లో ఒకరిని రోజూ కలుసుకుంటునే ఉంటారు, చెట్టా పట్టా కబుర్లు చెప్పుకుంటారు,ఒకరి అభిప్రాయాలు ఒకరితో పంచుకుంటారు. కానీ వాళ్లని ఎప్పటికీ కలవనీయకుండా చేసే పంతంతో మాత్రం గెలవలేక రోజూ ఒడిపోతూనే ఉంటారు. బహుశా ఆ బాధలోనే బంధాన్ని వెతుకుంటున్నారేమో.
వారి మద్య ఉన్నది విరహం కాదు అలా అని ప్రేమా కాదు. ఆ బంధాన్ని ఏమంటారో వాళ్ళకే తెలీదు. పేరు పెట్టకుండా బంధాలు ఉండకూడదా!!! అని ఆరా తీసేంత రెటమతపు మనుషులు. ఒకరి మీద ఒకరికి కోపం...మునుపులా ఉండలేమేమో అనే భయం నుండి వచ్చిన కోపం, కాలం వారి బంధాన్ని ప్రభావితం చేస్తుందేమో ఆనే భయం నుండి వచ్చిన కోపం, మరలా మనస్పర్థలు వస్తే తట్టుకోలేం అనే ముందు జాగ్రత్త వల్ల వచ్చిన కోపం.
ఆ కోపం కౌగిలిలో చిక్కుకున్న ఆ పసి హృదయాలు త్వరలో కలవాలని కోరుకుంటూ, ఈ నిస్వార్థమైన గోడును ఆ చిలుక వింటుందన్న ఆశతో...
తన గోరింక.

Comments
Post a Comment