Skip to main content

Posts

Showing posts from April, 2020

My Take on Pariyerum Perumal Movie

ఒక గొప్ప అనుకునే కులం వాడు, తక్కువ అనబడే కులం వాడితో అన్న, అంటున్న మాటలివి: "ఎన్ని రాజ్యాంగ సవరణలు చేసినా, ఎన్ని చట్టాలు రాస్కున్నా మీరు మా దిగువ (మాదిగ) కులమే, మాకన్నా ఎప్పుడూ తక్కువే!!!" కాలం మారినా, కల్మషం మారలేదు రోజులు మారినా, రాక్షసత్వం మారలేదు మనుషులు అనే విషయం మర్చిపోయి,  కులం కోసం కోసిన తలలెన్నో, తీసిన ప్రాణాలెన్నో...??? ప్రపంచం మొత్తం నాగరిక వ్యవస్థవైపు పరుగులు తీస్తుంటే, మనం మాత్రం కులవ్యవస్థవైపు పరుగులు తీసాం, తీస్తూనే ఉన్నాం... మారాల్సింది రాజ్యాంగాలో, చట్టాలో కాదు మనుషుల ఆలోచనలు, కాస్త అందరూ మనుషులే అనే ఇంగిత జ్ఞానం ఉండే చిన్న తరహా ఆలోచనలు.

Man Vs God

మనిషెంత గొప్ప వెర్రిబాగులోడంటే  వాడే దేవుణ్ణి సృష్టించి, వాన్నే దేవుడు సృష్టించాడని నమ్మించి, ఆ దేవుణ్ణి భయంతో పూజిస్తూ పైకి దాన్ని భక్తి అని చెప్పుకునేంత.                                                    -- శివనాగరాజు

The Story of a Telugu Medium Student

అనగనగా ఒక పల్లెటూరు.ఒక పన్నిండేళ్ల కుర్రాడు.వాళ్ళ ఊర్లో ఏడవ తరగతికి మించి చెప్పే ప్రభుత్వ పాఠశాల లేదని, వాళ్ళ ఊరికి 5KM దూరంలో ఉన్న పక్క ఊరి జిల్లా పరిషద్ పాఠశాలకు వెళ్లాల్సి వచ్చింది. ఏడవ తరగతి వరకు, ఏ Recognition లేని ఒక సాధారణ బడిలో, ఒకే మాస్టారు అన్ని subjects చెప్తుండగా, మాస్టారు గారి ఇంట్లోనే బడి, పట్టుమని పది మంది విద్యార్థులు కూడా ఉండరు, బడిలో అన్ని పనులు వీళ్ళే చెయ్యాలి... Blackboard ని మాస్టారు వాళ్ళ డాబా మీదకి తీస్కెల్లి, దాన్ని ఒక కుర్చీలో పెట్టి పాఠాలు చెప్పించుకోడం, బోర్డులు తుడవడం, మాస్టారు వాళ్ళ ఇల్లు ఊడవడం లాంటివి చేస్తూ అలా చదువుకుని ఆ టైంలో, ఏడవ తరగతి కి Common Exam ఉన్న టైంలో, 451/600 సాధించి, Corporate or Private స్కూళ్ల విద్యార్థులకి ధీటుగా నిలిచాడు. అప్పటివరకు ఆ కుర్రాడికి అన్ని బడులు అలానే ఉంటాయని నమ్మకం, తీరా పక్క ఊర్లో ఉన్న గవర్నమంట్ పాఠశాలకు పోగానే, అక్కడ ఒక్కో సబ్జెక్టు కి ఒక్కో టీచర్ ఉండటం చూసి ఆర్చర్యపోయాడు...ఇలా కూడా ఉంటారా! అని ఆర్చర్యపోతూ ఎనిమిదవ తరతిలోకి అడుగు పెట్టాడు.తెలుగు మీడియంలో చదివే ఆ కుర్రాడికి ఇంగ్లీష్ అంటే పరమ భయం. ఇంగ్లీష్ తప్ప మిగతా అన్న...