ఒక గొప్ప అనుకునే కులం వాడు, తక్కువ అనబడే కులం వాడితో అన్న, అంటున్న మాటలివి:
"ఎన్ని రాజ్యాంగ సవరణలు చేసినా, ఎన్ని చట్టాలు రాస్కున్నా
మీరు మా దిగువ (మాదిగ) కులమే, మాకన్నా ఎప్పుడూ తక్కువే!!!"
కాలం మారినా, కల్మషం మారలేదు
రోజులు మారినా, రాక్షసత్వం మారలేదు
మనుషులు అనే విషయం మర్చిపోయి,
కులం కోసం కోసిన తలలెన్నో, తీసిన ప్రాణాలెన్నో...???
ప్రపంచం మొత్తం నాగరిక వ్యవస్థవైపు పరుగులు తీస్తుంటే, మనం మాత్రం కులవ్యవస్థవైపు పరుగులు తీసాం, తీస్తూనే ఉన్నాం...
మారాల్సింది రాజ్యాంగాలో, చట్టాలో కాదు మనుషుల ఆలోచనలు,
కాస్త అందరూ మనుషులే అనే ఇంగిత జ్ఞానం ఉండే చిన్న తరహా ఆలోచనలు.
Comments
Post a Comment