అనగనగా ఒక పల్లెటూరు.ఒక పన్నిండేళ్ల కుర్రాడు.వాళ్ళ ఊర్లో ఏడవ తరగతికి మించి చెప్పే ప్రభుత్వ పాఠశాల లేదని, వాళ్ళ ఊరికి 5KM దూరంలో ఉన్న పక్క ఊరి జిల్లా పరిషద్ పాఠశాలకు వెళ్లాల్సి వచ్చింది. ఏడవ తరగతి వరకు, ఏ Recognition లేని ఒక సాధారణ బడిలో, ఒకే మాస్టారు అన్ని subjects చెప్తుండగా, మాస్టారు గారి ఇంట్లోనే బడి, పట్టుమని పది మంది విద్యార్థులు కూడా ఉండరు, బడిలో అన్ని పనులు వీళ్ళే చెయ్యాలి... Blackboard ని మాస్టారు వాళ్ళ డాబా మీదకి తీస్కెల్లి, దాన్ని ఒక కుర్చీలో పెట్టి పాఠాలు చెప్పించుకోడం, బోర్డులు తుడవడం, మాస్టారు వాళ్ళ ఇల్లు ఊడవడం లాంటివి చేస్తూ అలా చదువుకుని ఆ టైంలో, ఏడవ తరగతి కి Common Exam ఉన్న టైంలో, 451/600 సాధించి, Corporate or Private స్కూళ్ల విద్యార్థులకి ధీటుగా నిలిచాడు.
అప్పటివరకు ఆ కుర్రాడికి అన్ని బడులు అలానే ఉంటాయని నమ్మకం, తీరా పక్క ఊర్లో ఉన్న గవర్నమంట్ పాఠశాలకు పోగానే, అక్కడ ఒక్కో సబ్జెక్టు కి ఒక్కో టీచర్ ఉండటం చూసి ఆర్చర్యపోయాడు...ఇలా కూడా ఉంటారా! అని ఆర్చర్యపోతూ ఎనిమిదవ తరతిలోకి అడుగు పెట్టాడు.తెలుగు మీడియంలో చదివే ఆ కుర్రాడికి ఇంగ్లీష్ అంటే పరమ భయం. ఇంగ్లీష్ తప్ప మిగతా అన్ని సబ్జెక్ట్స్ అలవోకగా చదివేవాడు, ఎందుకంటే అవన్నీ తెలుగు భాషలో ఉండేవి కాబట్టి. ఏడవ తరగతి వరకు ఏదో వాళ్ళ మాస్టారు ఇచ్చిన దైర్యంతో ఇంగ్లీష్ అనే సబ్జెక్టు ని ఎలాగోలా నెట్టుకొచ్చాడు.ఇప్పుడు ఆ దైర్యం ఇచ్చేవాళ్ళు లేరు, కొత్త వాతావరణం, కొత్త టీచర్లు...అంతా కొత్త కొత్తగా ఉంది ఆ కుర్రాడికి...అయితే రోజులో వాళ్ళ మొదటి క్లాస్ హిందీ, వాళ్ళ క్లాస్ టీచర్ కూడా వాళ్ళ హిందీ మేడమే. తర్వాత ఇంగ్లీష్ క్లాస్ వచ్చింది, ఆ కుర్రాడికి భయంతో వణుకు స్టార్ట్ అయ్యింది.వాళ్ళ టీచర్ వచ్చి అందర్నీ ఇంగ్లీషులో Introduce చేసుకోమని చెప్పింది. ఆ వనుకుతో తడబడుతూ రెండు ముక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడేసరికి వాడి తల ప్రాణం తోక్కొచ్చింది..ఆ మాట్లాడిన రెండు మాటలు "My Name is ***, I come from ***" అది కూడా ముందు చెప్పిన వాళ్ళని కాపీ కొట్టి.అలా ఆ రోజు గడిచిపోయింది.రెండో రోజు వాళ్ళ టీచర్ ఒక assignment ప్లాన్ చేసింది. రోజూ ముగ్గురు విద్యార్థులు ఒక్కో Paragraph ఇంగ్లీష్ లో చదవాలి. వారం రోజులు గడిచేసరికి వీడి turn రానే వచ్చింది, గుండెల్లో వణుకుతో లేచి నిల్చున్నాడు, ఒక్కో పదాన్ని పది సెకన్ల వ్యవధిలో మెల్లగా చదువుతున్నాడు, టీచర్ కి కోపం వచ్చింది, తోటి విద్యార్థులకి నవ్వొచ్చింది..వాడిని చదవడం ఆపమని, అలానే క్లాస్ అయ్యేవరకు నిలబడమని వార్మింగ్ ఇచ్చి క్లాస్ continue చేసింది. మరుసటి రోజు వీడిని మళ్లీ చదవమంది, ఈసారీ అదే ధోరణి, పదానికి పదానికి పది సేకనుల వ్యవధి. టీచర్ కి చిరాకు వచ్చి ఇలా అంది "నీకు ఆ paragraph సరిగ్గా,ఆపకుండా చదవడం వచ్చేవరకు నా క్లాస్ లో రోజూ నిలబడాలి". పన్నిండేళ్ల ఆ కుర్రాడికి ఏడుపొచ్చింది, క్లాస్ మొత్తం ఫక్కున నవ్వేసరికి ఆ ఏడుపు రెట్టింపయ్యింది.అలా రోజూ ఆ టీచర్ రావడం, వీడికి ఒక ఛాన్స్ ఇవ్వడం, వీడు చదవలేకపోవడం, ఫలితంగా రోజూ ఇంగ్లీష్ period మొత్తం అందరి ముందు ఒక మూలన నిలబడి ఉండటం. వాడికీ starting లో బాధేసేది, తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది. బాదేసిన ప్రతిసారీ కసిగా రేపు బాగా చదవాలి అనుకునేవాడు కానీ ఎవరి సాయం కానీ ప్రోత్సాహం కానీ లేక చడవలేకపోయేవాడు.అలా ఒకటి కాదు, రెండు కాదు మూడేళ్లు రోజూ ఇంగ్లీష్ క్లాసులో నిలబడుతూ నే ఉండేవాడు.కానీ ఇంగ్లీష్ Examsలో మాత్రం బట్టి పట్టి ఎలాగోలా ఒక మోస్తరు మార్కులతో పాస్ అయ్యి బయట పడేవాడు.అలా పదవ తరగతి కూడా అయిపోయింది. కట్ చేస్తే ఆ కుర్రాడు వాళ్ళ స్కూల్ topper 530/600 మార్కులతో...కానీ ఇంగ్లీష్ మాత్రం ముక్క రాదు.ఆ కుర్రాడి పేరే "శివనాగరాజు చల్లగిరి".
ఇన్నాళ్లూ నాకు ప్రేమించడం రాదనుకున్నా కానీ ప్రేమించబడటం కూడా రాదేమో కారణాలు చాలా ఉన్నాయ్ సమాధానాలూ చాలా ఉన్నాయ్ నమ్మకం మాత్రం ఒకటే అనుభవం నుంచి వచ్చిన నమ్మకం కాలం నేర్పిన నమ్మకం ప్రపంచం కళ్ళకి కట్టి చూపించిన నమ్మకం ఇన్నాళ్లూ నిజం కాని అబద్ధాన్ని నమ్మాలని ప్రయత్నించా కానీ ఒక అబద్ధాన్ని శాశ్వతంగా నిజం ఏ అబద్దం చెయ్యలేదని నమ్మలేకపోయా ఈ ప్రయత్నంలో నన్ను నీలో దాచుకున్నా కానీ నిన్ను నాలో దాచుకునే స్థోమత లేదని తెలిసాక నన్ను నేను వెనక్కి తీస్కోలేకున్నా ప్రేమతో సహవాసం చేసి విరహ వలలో చిక్కుకున్నా నువ్వు వచ్చి విడపిస్తావనే ఇంకో అబద్ధాన్ని నమ్ముతూ మన ఈ జ్ఞాపకాలతో ఇలా ఈ జీవితాన్ని బ్రాహ్మచర్యంలో గడుపుతూ.... - శివనాగరాజు ఇంటిపేరులేదు
Comments
Post a Comment