ఇన్నాళ్లూ నాకు ప్రేమించడం రాదనుకున్నా కానీ ప్రేమించబడటం కూడా రాదేమో కారణాలు చాలా ఉన్నాయ్ సమాధానాలూ చాలా ఉన్నాయ్ నమ్మకం మాత్రం ఒకటే అనుభవం నుంచి వచ్చిన నమ్మకం కాలం నేర్పిన నమ్మకం ప్రపంచం కళ్ళకి కట్టి చూపించిన నమ్మకం ఇన్నాళ్లూ నిజం కాని అబద్ధాన్ని నమ్మాలని ప్రయత్నించా కానీ ఒక అబద్ధాన్ని శాశ్వతంగా నిజం ఏ అబద్దం చెయ్యలేదని నమ్మలేకపోయా ఈ ప్రయత్నంలో నన్ను నీలో దాచుకున్నా కానీ నిన్ను నాలో దాచుకునే స్థోమత లేదని తెలిసాక నన్ను నేను వెనక్కి తీస్కోలేకున్నా ప్రేమతో సహవాసం చేసి విరహ వలలో చిక్కుకున్నా నువ్వు వచ్చి విడపిస్తావనే ఇంకో అబద్ధాన్ని నమ్ముతూ మన ఈ జ్ఞాపకాలతో ఇలా ఈ జీవితాన్ని బ్రాహ్మచర్యంలో గడుపుతూ.... - శివనాగరాజు ఇంటిపేరులేదు
ఆ అమ్మాయికి పెళ్లయి 6 నెలలు అవుతోంది.Costume Designer గా work చేస్తుంది. మొగుడు Software Engineer. పెళ్లయ్యాక కూడా తను ఎప్పటిలాగే work చేస్తానని వాళ్ళ అత్తమ్మ, మామయ్య, మొగుణ్ణి ఒప్పించేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది.ఓ రోజు night party జరగడం వల్ల ఇంటికి late గా రావాల్సి వచ్చింది, అది కూడా తాగి.ఇంటికి రాగానే ముక్కిరిచుకుంటూ అత్తగారు, ఎదురు పడినా మాట్లాడని మామగారు, bedroom లోకి వెళ్ళగానే "ఎవరితో కులికి వచ్చావే???" అనే మాటలు తనకు ఆశ్చర్యాన్ని కలిగించాయి.తను పెళ్లి కాకముందు చాలా సార్లు ఇంటికి lateగా వచ్చింది, తాగి కూడా. ఎప్పుడూ తన అమ్మానాన్నలు ఏమనలేదు.మరుసటి రోజు ఆ ఇంట్లో పెద్ద debate, తను work చేయడం continue చెయ్యాలా వద్దా అని. అందరూ తనేదో పాపం చేస్తున్నట్టు చూసిన చూపులకి చిరాకేసి ఆ వివాహ వ్యవస్థ నుండి బయటకి వచ్చి ఒక divorcee గా ఏ restrictions లేకుండా హాయిగా బతకడం start చేసింది. ఇదీ మనం ఎంతగానో గౌరవించే వివాహ వ్యవస్థ అసలు రూపం. ...