అందమే ఆమెనా ఆమెనే అందమా ఆ బొమ్మని చూసిన నా కనుబొమ్మ జన్మ ధన్యం ఆ సెకను సమయం మనసులో పదిలం కను రెప్ప వేయనీయని ఆ అందం చూసి ఉరకలేసెను యవ్వనం ఆమె వదిలి వెళ్ళిన ఆ క్షణం కనురెప్ప వదిలెను కన్నీరు ఇది నిజం ఆమె సౌష్టవం చూసి అల్లాడిపోయిన నా మగతనం అయినా నాలో నన్ను మరిపించింది ఆ దృశ్యం -శివనాగరాజు
దేహదాహల తాపాలతో మరిగిపోతున్న ఈ యవ్వనకోటని ఏలడానికి మళ్లీ రావా నా ప్రేయసి ప్రేమ లేదన్న విరహంలో బతుకుతున్న ఈ ప్రాణాన్ని నీ ప్రేమసాగరాన ముంచడానికి మళ్లీ రావా నా ఊర్వశి ఒంటరిగా ఉన్న ఈ యవ్వనాన్ని నీ అందచందాలతో పరిపూర్ణం చేసేందుకు మళ్లీ రావా నా రాక్షసి
ఓ ప్రేమా నాలో నన్ను మరిచేలా నీతో నన్ను పూర్తి చేశావే ఎందుకే నేనంటే అంత ప్రేమ ఓ ప్రేమా నన్ను గమ్యం లేని ప్రయాణం లోకి తోసేసి నా జీవిత గమ్యం నువ్వే అయ్యావు కదే అందుకే నువ్వంటే నాకు అంత ప్రేమ
కళ్ళ ముందు కనిపించే తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వం కానీ ఎవ్వడికీ కనిపించనీ గన్నాయ్ గాడు దేవుడి మీద మాత్రం స్వార్ధపు గౌరవం, భయం వల్ల వచ్చిన ప్రేమ. అసలు మనుషులే దేవున్ని సృష్టించి, దేవుడే మనుషుల్ని సృష్టంచాడని నమ్మంచి ఆ భ్రమలోనే ఇంకా బతుకుతున్నాం
తెలియని భావన తెలపలేని వేదన పలకలేని మౌనమా నా ప్రేమకిదే మరణమా!!! తను నను వదిలి వెళ్ళాక... తనలోనే ఆగిపోయా తనతోనే ఉండిపోయా నన్ను నేనే మరచిపోయా నిన్నలోనే ముగిసిపోయా తన ఊహ కోసం పరితపిస్తున్న కాలం క్షణాలు నిముషాలు, నిముషాలు గంటలు, గంటలు రోజులు, రోజులు మాసాలవ్వగా తన రాక కోసం కబురు పెట్టిన నా మౌనం తన మాట కొరకు ఎదురుచూసిన నా గమ్యం తన అల్లరి కోసం ఎదుచూసిన ఈ శూన్యం తనలేమిని తనతోనే భర్తీ చెయ్యాలని విలవిలలాడే ఈ నా ప్రాణం అనుభవాలు...అందంగా రాస్తే వినడానకి వినసొంపుగా చూడడానికి కన్నులవిందుగా ఉంటాయ్ భరించడానికే లక్షల టన్నుల భారంగా ఉంటాయ్ పరిచయాలు ఒకానొక రోజున జ్ఞాపకాలుగా మిగిలి పోతాయని ఊహించకుండా బతికేస్తాం కదా!
నాలుగు లేత పెదవులు ఆలింగనం చేస్కుంటే దాన్ని చుంబనం అంటారు, రెండు లేత దేహాలు సరసపు అంచులలో తేలిపోతే దాన్ని శృంగారం అంటారు, రెండు లేత మనసులు పరస్పరం ఒకరికొకరు పరిచయం చేస్కుంటూ ఉంటే దాన్ని ప్రేమ అంటారు.
Life లో ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత సంపాదించినా...చెప్పుకోడానికి ఓ ప్రేమకధ, రాసివ్వడానికో ప్రేమలేఖ లేకపోతే ఆ లోటెప్పుడూ పదే పదే మనసుని పొడుస్తూనే ఉంటుంది.
నీ జీవితంలో నువ్వు ఒకలాగా ఉండాలి అనుకుంటావ్ సమాజం మరోలాగా ఉండమని బలవంతం పెడుతుంది నీ చుట్టూ ఉండేవాళ్ళు ఇంకోలాగా ఉండమంటారు వీటన్నింటినీ దాటి నువ్వు నీలా బ్రతకడం అంత సులభం ఏమీ కాదు దానికి చాలా దైర్యం కావాలి చాలా తెగువ ఉండాలి చాలా తెలివి కావాలి చాలా తెలిసి ఉండాలి అలా నీలా నువ్వు బ్రతకడమే విజయం అంటే విజయం అంటే ఎక్కడో ఉండదు, నువ్వు చేసే పనుల్లో ముఖ్యంగా నీలో ఉంటుంది, నీతో ఉంటుంది, నీవెంటే ఉంటుంది కేవలం నువ్వు నీలా ఉండగలిగినప్పుడు - శివనాగరాజు
నీ మరుపే నను తుడిసిపోయే నీ ఊసే నను మరచిపోయే నీ చూపే నను తాకకుంటే నా శ్వాసే నను వీడుతుందే ఈ పయనం నా వల్ల కాదే నా ప్రాణం నాలోన లేదే నీ ప్రేమే లేకుంటే ఇంక విడిచేనే నను నేనే నీలో నీలోనే నను మరచినావే నాలోనే నిను చెరిపినావే నీతోనే ఉంటానే నేను ఇంకెపుడు నిను వీడలేను
నా కళ్ళు రాసే కొత్త కవిత నీవేనే నా చూపు పలికే మొదటి మాట నీ పేరేనే నా మనస్సు నవ్వే మొదటి నవ్వు నీ వలనే నా మౌనం వేసే మొదటి ఈల నీ కోసమే నలన నీ వలన నాలోన నిలువెత్తు ప్రేమ మొలిచెనె నీలాంటి ప్రేమ నిలిచెనె మనలాంటి ప్రేమ మిగిలెనె
There will be three types of people in your life. Some love/respect your thoughts, some hate/dislike your thoughts and some just stay neutral and enjoy seeing your thoughts. One thing we need to remember here is we cannot please everybody in our life. We are not born to please someone. If they love you, let them love. If they hate you, let them hate. If they don’t bother you, let them be. We are here to please our own self not the fucking outsiders.
Cowardice and Courage met her Both became friends to her She asked them ” what do you want from me?” They started saying but she interrupted them and said “You should really mean it” Cowardice said “I need your unconditional love” Courage said “ I am impressed by your physique. I wanna have children with you. To be frank, I want to have sex with you” She said with sad face “ I am unfit for sex” Cowardice “I am so sorry. I will look for another girl” Courage “No problem, Let’s just be together “ She went to courage and revealed the truth that She is as fit as him sexually 😉 Cowardice felt shameful.